ఎడారి కొలను 

43వ భాగం

(ఇప్పటివరకు :  వెంకటేశ్వర్లు గారు అడిగిన దానికి తనకు పెళ్లయిందని చెబుతాడు. అ రాత్రి గతం తాలూకు ఆలోచనల తోటి నిద్దరకు దూరమవుతాడు ప్రసాద్.  ప్రసాద్ కి గతం గురించిన  ఆలోచనలలో అపూర్వ గుర్తుకొస్తుంది. : వసుంధర మాటలతో ప్రభావితమవుతుంది మైత్రేయి. వసుంధర మైత్రేయి కి చాలా లీగల్ విషయాలు చెబుతుంది. ప్రసాద్ కి తన గతపు ఛాయలు గుర్తుకొచ్చి నిద్దర పోలేక పోతాడు.అపూర్వ తోటి పరిచయం పెళ్ళికి దారితీస్తుంది. అపూర్వ కి  భవ్య తోటిస్నేహ  సంబంధం కాస్త తేడాగా ఉంది)

అలా కొద్దీ రోజుల తరువాత చంద్రమౌళి ప్రసాద్ కి ఫోన్ చేసాడు. “ ప్రసాద్ ముహుర్తాలు ఎప్పుడు పెట్టించమంటావు,” అన్నాడు. 

“అపూర్వని అడిగారా.”

 అదే తొందరపెడుతున్నది. నీనుండేమి కబురు రాక పోవటం తో తెలుసుకుందామని అడుగుతున్నాను,” అని అన్నాడాయన. “అలాగే సార్ ! మీ ఇష్టం,” గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. 

తనకి కూడా మనసులో అపూర్వ అంటే ఇష్టం ఉన్నది. అంత అందమయిన అమ్మాయి , మంచి కుటుంబం ఉన్న అమ్మయి తనకి భార్య అవుతుందంటే ఇంకేం కావాలి. పైగా తనకి అపూర్వ అన్న , ఆమె చేసే చిలిపి పనులు, చిన్న పిల్ల మనస్తత్వం అన్ని తనకెంతో నచ్చు తాయి. అందుకే ఆమెలో ఉన్న కొన్ని బలహీనతలు తన ఇష్టం ముందు నిలబడవు. పెళ్లయిన తరువాత అపూర్వ లో ఉన్న తొందరపాటు తనం ,  కోపం లాటివి తగ్గించొచ్చులే అని మనస్ఫూర్తిగా ఆమెతో వివాహ బంధానికి ఒప్పుకున్నాడు. 

ఒక వారం తరువాత , “ హలో ప్రసాద్, వీలు చూసుకొని సాయంత్రం  ఇంటికి రా,” అని చంద్రమౌళి ఫోన్ లో చెప్పాడు. 

అయన చెప్పే శుభవార్తకోసం ఆ సాయంత్రమే వాళ్ళింటికెళ్ళాడు.  చక్కటి ఇక్కత్ పట్టు చీర కట్టు కొని ముస్తాబయి కూర్చొని ఉన్నది అపూర్వ వాళ్ళ అమ్మ పక్కన. వాళ్ళకెదురుగా పెళ్లి  ముహూర్తం పెట్టడానికి అయ్యాగారు కూర్చొని ఉన్నాడు. చంద్రమౌళి కాలింగ్ బెల్ వింటూనే తలుపు తీసి, ఏంతో  సాదరం గ ప్రసాద్ ని లోపాలకి ఆహ్వానించాడు. సుమతి వెళ్లి  ఆరంజ్ జ్యుస్ తెచ్చి అందరికి ఇచ్చింది. అప్పటికే అయ్యగారు  వారి నామఫలంతో  ముహూర్తం పెట్టడానికి ఏవో లెక్కలు కడుతున్నాడు. అందరు మౌనం గ కూర్చొని ఉన్నారు. 

కొద్దీ సేపటికల్లా అయ్యగారు ,” చంద్రమౌళి గారు , వచ్చే నెలలోనే మంచి ముహూర్తం ఉన్నది, శ్రావణ  మాసం, సప్తమి, ఆదివారం ఉదయం 8’11 నిముషాలకు దివ్య మయిన ముహూర్తం. వీళ్ళకి చాల బాగా కుదిరింది. అదే ఖాయం చేయమంటారా ,” అడిగాడు ఆయన.

” ఓకే, ఓకే పంతులు గారు, ఆ డేట్ నే ఫిక్స్ చేసేయండి,” అని సంతోషం తో చప్పట్లు కొ డుతూ అపూర్వ చెప్పేసింది.

 “అంత తొందర పడకమ్మా, నాన్న గారిని , అమ్మగారిని చెప్పనివ్వు,” అన్నాడాయన నవ్వుతూ. చంద్ర మౌళి గారు కూడా నవ్వుతూ, “అలాగే ఆ డేట్ ఖాయం చేద్దాం, ఏమంటావు ప్రసాద్ ,” అన్నాడాయన. 

“అలాగే అంకల్ మీ కన్వీనియన్స్ చూసుకోండి, నా కేమి అభ్యంతరం లేదు,” అన్నాడు. 

“ ఒకే ఆ డేట్ ఖాయం చేసు కుందాము. మరి ఎంగేజ్ మెంట్ కూడా డేట్ చెప్పండి,” అన్నాడు. “ భేషుగ్గా , వచ్చే ఆదివారం సాయంత్రమే  మీరు ఎంగేజ్ మెంట్ చేసుకోవచ్చు , లేదంటే ఇంకో పదిహేను రోజులు ఆగాల్సి ఉంటుంది,” అన్నాడాయన. 

 

“ ఇంకేం శుభస్యశీఘ్రం ,” అంటూ ఆ డేట్ కూడా ఫిక్స్ చేసి,  “ప్రసాద్ నువ్వు ఎవరినయినా పిలవాలంటే పిలు. నాకు ఎంతమంది వస్తారో చెబితే చాలు,” అని అన్నాడాయన.  

“నాకంటూ ఎవరు మిగలలేదండి,మీరందరే  నావాళ్లు ,” అన్నాడు ప్రసాద్. ప్రసాద్ భుజం మీద తడుతూ, “నాకు ఇద్దరు కొడుకులు ఇప్పుడు,” అన్నాడాయన చెమర్చిన కళ్ళతో.

 ఎంగేజ్మెంట్ రోజున కొంత మంది ఇరుగుపొరుగువాళ్లు తప్ప పెద్దగా ఎవ్వరిని పిలవలేదు ఆయన. అపూర్వ తన క్లోజ్ ఫ్రెండ్ భవ్య ని పిలిచింది. 

అపూర్వ , భవ్య కలిసి బ్యూటీ పార్లర్ కెళ్ళి డ్రెస్ అప్ చేయించుకొని వచ్చారు. అపూర్వ మరింత అందం గ కనిపిస్తున్నది. భవ్య అపూర్వనే అతుక్కొని తిరుగుతున్నది.  

ప్రసాద్ కోసం చంద్రమౌళి గారు కుమారన్ మాల్ నుండి మంచి పట్టు కుర్తా పైజామా తెప్పించాడు. నీలి రంగులో ఉన్న బ్రోకేడ్ కుర్తా, వైట్ పైజామా తో ప్రసాద్ చాల నిండుగా అందం గ కనిపిస్తున్నాడు. 

భవ్య ప్రసాద్ ని చూస్తూనే హాయ్ హ్యాండ్సమ్  , “లుకింగ్ రిచ్ ,” అని అన్నది. ప్రసాద్ కాస్త సిగ్గు పడ్డాడు ఆ కాంప్లిమెంట్ కి.  అపూర్వ కూడా చక్కటి నీలిరంగు మేజన్తా  బార్డర్ ఉన్నపట్టు  చీరలో చాల ముచ్చటగా ఉన్నది. అయ్యగారు ఎంగేజ్మెంట్ కి కావాల్సిన తయారీ చేసాడు. 

రింగ్ సెరిమొని మొదలయింది. ఆయన,” బాబు ఈ ఉంగరం అమ్మాయి కుడి చేతి ఉంగరంవేలికి పెట్టు” అంటూ  అందించాడాయన.  అప్పుడే పక్కనే ఉన్న భవ్య అపూర్వ కుడి చేయి తీసుకొని తాను తెచ్చిన గోల్డ్  రింగ్ ని అపూర్వ కుడి చేతి ఉంగరం వెలికి తొడిగింది.

“అదేంటమ్మా అలా చేసావు, గిఫ్ట్ తరువాత ఇచ్చుకోవచ్చుగా, ఆ ఉంగరం తీసేయ్,” అన్నాడు అయ్యగారు. 

“పర్లేదు ,ప్రసాద్ ఏమి అనుకోడు,” అంటూ, “ ఈ ఉంగరం పైనే నీ ఉంగరం కూడా పెట్టు ప్రసాద్, అది అంత ప్రేమ గా తొడిగింది కదా , నాకు తీయాలని లేదు ,” అంది గోముగా. 

ప్రసాద్ ఎం మాట్లాడకుండా ఉంగరం మీదనే తన ఉంగరం ఎక్కించాడు. సుమతి , చంద్రమౌళి గారు ఇద్దరు మొహాలు చూసుకున్నారు, కానీ ప్రసాదేమి అభ్యంతరం చెప్పక పోవడం తో వాళ్ళు మాట్లాడకూడదని ఊరుకున్నారు. 

ఉంగరమయితే పెట్టాడు కానీ మనసంతా ఏదోలా అయిపొయింది ప్రసాద్ కి. మనసు ఎదో చెబుతున్నది. కానీ నమ్మ బుద్ధికావటం లేదు. అపూర్వది  చిన్నతనం అనుకోని తనకి తానే నచ్చ చెప్పుకున్నాడు. సుమతి అడిగింది,” అదేంటి అపూర్వ భవ్య అలా చేసింది , తప్పుగదా!” 

“మామ్, నువ్వలాటి చాదస్తం పెట్టుకోకు. ప్రసాద్ ఏమైనా అన్నాడా లేదుగా. మరి నీకెందుకు అంత పట్టింపు. అది నా క్లోజ్ ఫ్రెండ్ , నా పెళ్లి అన్న ఎక్సయిట్మెంట్ లో ఆలా పెట్టేసుంటుంది , నువ్వలాటివి  పట్టించుకోకు ,” అంది. కానీ సుమతి భవ్య చేసిన పనిని అంగీకరించలేకపోయింది. ‘తనకే ఇలా ఉంటె ప్రసాద్ కి ఎలా ఉందొ ,’  అని మనసులోనే అనుకుంది. ఆ రాత్రి తనతోటె ఉండమని భవ్యని అపూర్వ ఆపింది.  

వచ్చిన గెస్ట్స్ అందరు వెళ్లిపోయారు. ప్రసాద్ అన్నాడు “నేను వెళతాను, అంకుల్.” 

“ ఇంత పొద్దుపోయింది. ఇక్కడే పడుకో ప్రసాద్. ఇప్పుడయితే నువ్వు మాములుగా అపూర్వ ఫ్రెండ్ ప్రసాద్ కాదు. మా ఇంటి అల్లుడివి. మా అబ్బాయి రూమ్లో పడుకో. రేపు బ్రేక్ ఫాస్ట్ చేసి ఆఫీస్ కి ఇక్కడనుండి వెళ్లొచ్చు,” అన్నాడాయన. అపూర్వ తోటి కాస్త టైం స్పెండ్ చేయొచ్చనుకున్నాడు. అందుకే ఆగిపోయాడు. 

రాత్రికి టెర్రస్ మీద అందరు కూర్చొని కొద్దిసేపు కబుర్లు చెప్పుకోవటానికి కావలసిన ఏర్పాటు చేసింది సుమతి. అందరు పార్టీ తరవాత ఫ్రెష్ అప్ అయి టెర్రస్ మీదకెళ్లారు. చాలాసేపు మ్యారేజ్ ప్రిపరేషన్స్ గురించే మాట్లాడుకున్నారు. మేము పడుకుంటాము, మీరు కబుర్లు చెప్పుకోండి కావాలంటే,”  అంటూ సుమతి చంద్రమౌళి గారు వెళ్లి పోతూ . “ రారా బుజ్జి నువ్వు కూడా పడుకో , రేపు ఉదయాన్నే గ్రౌండ్ కి వెళతావుకదా,” అంటూ అపూర్వ తమ్ముడిని కూడా వెంటపెట్టుకొని కిందకెళ్ళిపోయారు.

 భవ్య , అపూర్వ ప్రసాద్ మిగిలారు పైన. అపూర్వ భవ్య  అతుక్కొని కూర్చున్నారు. ఒకరి మీద ఒకరు పడిపోతూ కబుర్లు చెబుతున్నారు. కొన్నిసార్లు భవ్య అపూర్వ చేష్టలు చూస్తుంటే కాస్త ఇబ్బందికరం గ అనిపించింది ప్రసాద్ కి. 

“ అపూర్వ, నాకు నిద్దరవస్తున్నది. నేనెళ్ళి పడుకుంటాను.,” అన్నాడు. 

“ అబ్బాయి గారికి అసూయగా ఉన్నదా, మా ఇద్దరి స్నేహం చూసి”. అంటూ, “ప్రసాద్ మీద కు ఒరిగి అతని లిప్స్ మీద ముద్దు పెట్టింది. అనుకోకుండా అపూర్వ ఆలా చేయడంతో ప్రసాద్ కాస్త తత్తర పడి , సర్దుకొని, “థాంక్స్  ఫర్ సచ్ సర్వప్రయిజ్ గిఫ్ట్,” అంటూ లేచాడు వెళ్ళటానికి. “మేంకూడా వస్తున్నాం” అంటూ భవ్య, అపూర్వ కూడా లేచారు. ప్రసాద్ బుజ్జి రూమ్ లో కి  , అపూర్వ భవ్య, అపూర్వ రూమ్ లోకి వెళ్లిపోయారు పడుకోవటానికి. 

ప్రసాద్ కి ఎందుకో భవ్య అపూర్వ వాళ్ళ ఫ్రెండ్ షిప్  నార్మల్ గ అనిపించటం లేదు. ఆలోచిస్తూ ఎప్పటికో నిద్దర పోయాడు. అప్పటికే బుజ్జి మంచి నిద్దరలో ఉన్నాడు. 

                                               ****

    నెలరోజులలో అపూర్వ ప్రసాద్ ని కలిసి సాయంత్రాలు తిరగడం, కొద్దిసేపవగానే, నాకు బోరుగాఉన్నది , నన్ను భవ్య  ఫ్లాట్ దగ్గర దించే సేయ్ అనటం మామూలయింది. ప్రసాద్ అంత  సీరియస్ గ పట్టించుకోలేదు. మ్యారేజ్ తరువాత అపూర్వ కి బోర్ కొట్టకుండా ఎలా చూసుకోవాలన్నా ఆలోచనలే నిండిపోయాయి మనసంతా. 

      సిటీ కి దూరం గ కొత్తగా కడుతున్న ఫ్లాట్స్ లో ఒకటి బుక్ చేసాడు. చంద్రమౌళి కొంత లోన్ ఇప్పించాడు. తన సేవింగ్స్ ని వాడుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. పెళ్ళికి ముందే ప్రసాద్ ఒక మంచి అపార్ట్మెంట్ అపూర్వ కోసం రెడీ చేసాడు. ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ అంత ఏర్పాటు చేసాడు. రాబోయే భార్య కోసం ప్రసాద్ పడుతున్న ఆరాటం ఎంతో ముచ్చటగా అనిపించింది సుమతికి. 

“ప్రేమించే పెళ్లి చేసుకోనక్కర లేదు. పెళ్ళైన తరువాత కూడా ప్రేమించొచ్చు. మన ప్రసాద్ లాగా , మన అపూర్వ చాల అదృష్టవంతురాలు, ప్రాణప్రదం గ ప్రేమించే భర్త రాబోతున్నాడు,” అంది సుమతి చంద్రమౌళి గారి తో. మనసులో మాత్రం,” ఈ పిల్ల ప్రసాద్ కి తగినదేనా ,” అనుకున్నది.

పెళ్లి రోజు వచ్చేసింది. వాళ్ళకి దగ్గరి లోనే ఉన్న మంచి కల్యాణమండపం బుక్  చేయబడింది.  

చంద్రమౌళి , సుమతి  వాళ్ళ బంధువులందరికి  పెళ్లిపత్రికలు పంపించారు. ఆఫీస్ లోవాళ్లందరిని పిలిచాడు ప్రసాద్.

      వివాహ క్రతువు చాలా సరదాగా జరిగింది. అన్ని కార్యక్రమాలో భవ్య అపూర్వను అంటి పెట్టు కొనే ఉంది. మంగళ సూత్రం ధారణ సమయంలో , భవ్య అపూర్వ వెనకాలే నిలబడి ఉంది. అపూర్వ పూలజడని ఎత్తిపట్టుకుంది. అయ్యగారు చెప్పాడు నవ్వుతు,” బాబు “నాతి  చరామి అనుకొంటూ ,” మూడు ముళ్ళు వేయి ,” అని అయన మంగళ సూత్ర ధారణ మంత్రోచ్ఛారణ చేయిస్తున్నాడు. మంగళ వాయిద్యాల హోరు లో ప్రసాద్ మంగళ సూత్రం ధారణ చేస్తున్నాడు. రెండు ముడులు వేయగానే, అతను ను ఊహించని విధంగా ప్రసాద్ వేళ్ళను పక్కకు తోసి , మూడో ముడి ని భవ్య వేసింది. అంత  రెప్పపాటులో జరిగింది. ఏం జరిగిందో తెలుసుకునేటప్పటికే అందరు అక్షతలు చల్లడం మొదలుపెట్టారు. ప్రసాద్ కి అయోమయంగా అనిపించింది. అపూర్వ మొహం లోకి చూసాడు, అపూర్వ ఏంతో  అనురాగం తో భవ్య చేయి పట్టు కొని ఊపేస్తున్నది ఆమె ప్రసాద్ తననే చూ స్తున్నది  గమనించకుండానే. ఈ చర్యమొత్తం సుమతి దృష్టి లో పడింది. ప్రసాద్ మొహం లో మా రి న రంగులు కూడా ఆమె దృష్టిని దాటి పోలేదు.

   రిసెప్షన్ చాల గ్రాండ్ గ ఏర్పాటు చేయబడింది. వధూవరులకు మంచి మండపం తయారు చేయబడింది. ప్రసాద్ అపూర్వ చూడ ముచ్చట గ ఉన్నారు. అందరు ‘వీళ్లిద్దరు మెడ్ ఫార్ ఈచ్ అదర్’ అని అన్నారు. 

రిసెప్షన్ లో కూడా భవ్య అపూర్వ పక్కనే నిలబడి ఉండటం సుమతి కి అంతగా నచ్చలేదు. అందుకే గెస్ట్స్ రావడం మొదలవగానే, సుమతీ స్వయం గ భవ్య ని చేయి పట్టు కొని కిందకి తీసుకొచ్చి, గెస్ట్లను రిసీవ్ చేసుకొనే దగ్గర నిలబెట్టి, భవ్య అక్కడి నుండి కదలకుండా జాగర్త పడింది. రిసెప్షన్ అయినా వెంటనే ప్రసాద్ ని అపూర్వ ని వాళ్ళకోసం ప్రత్యేకంగా తయారు చేసిన గది  దగ్గర దిగబెట్టి, వాళ్ళను లోపలికి వెళ్ళేదాకా ఆగి , అమ్మయ్య భవ్య చుట్టుపక్కలెక్కడ లేదు కదా అని నిర్ధారించుకొని ఆమె, చంద్రమౌళి గారితో కలిసి ఇంటికి వెళ్ళిపోయింది. 

కానీ సుమతి నే గమనిస్తూ ఆ గది  కి రెండు గదుల పక్కనే తనకోసం ఒక గది  బుక్ చేసుకొని భవ్య ఉన్నదన్న సంగతి సుమతి గమనించలేకపోయింది. గదిలోకి వెళ్లిన వెంటనే అపూర్వ వాష్ రూమ్ లోకి దూరి , స్నానం చేసి, పింక్ కలర్ వైట్ పూల డిజైన్ ఉన్న నైటీ వేసుకొని వచ్చింది. ప్రసాద్ ని కూడా వాష్రూమ్ లోకి తరిమింది  ఫ్రెషప్ అయి రా అని. ప్రసాద్ ఫ్రెష్ అప్ అయి తెల్లటి లాల్చీ , వైట్ పైజామా వేసుకున్నాడు. అలా బయటికొచ్చిన ప్రసాద్ ని కన్నార్పకుండా చూస్తూ .తన చేతిలో ఉన్న ఫోన్ పక్కన పెటేసింది.  అందులోనుంచి హలో , హలో అపూర్వ రెడీ అయ్యావా, మాట్లాడవేంటి. ప్రసాద్ వచ్చాడా వాష్రూమ్ నుండి ,” అని ఎవరో అడుగుతున్నమాటలను వినిపిస్తున్నాయి. 

ప్రసాద్ చనువుగా అపూర్వ పక్కన కూర్చుంటూ,   “దేవి గారు ఎవరితోనో మాట్లాడుతున్నట్లున్నారు, పాపం, వాళ్ళు మిమ్మల్ని ఏమో అడుగుతున్నారు, చెప్పండి, నన్ను తరవాత చూసుకుందురుగాని ,” అంటూ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. కంగారుగా ఫోన్ లాగేసి కొని   “ఎవరు లేరు. ఎవరు లేరు.” అంటూ ఫోన్ పెట్టేసింది అపూర్వ.  

 “ పర్లేదు అపూర్వ, మాట్లాడు”  అంటూ, బెడ్ మీదకి వెనక్కి  వాలి పడుకున్నాడు.

  “ఎం లేదు డియర్, నీ కంటే ఎవ్వరు అంత ఇంపార్టెంట్ కాదు నాకు ఇప్పుడు,” అతని గుండెల మీద తలవాల్చి పడుకుంది. అలా  కొద్దీ సేపయిన తరువాత,” ప్రసాద్ నాకు నిద్దర ముంచుకొచ్చేస్తున్నది, బాగా అలిసి పోయాను,” అంటూ మరో పక్కకు వాలి పడుకుండి  పోయింది అపూర్వ. 

   ప్రసాద్ “ ఓకే, ఓకే, నువ్వు పడుకో,” అంటూ ఆమె కి దుప్పటి కప్పి తాను పడుకున్నాడు. అలసిపోయి  ఉండడంతో కొద్దిసపటికె  ప్రసాద్ కి కూడా రెప్పలు మూత పడ్డాయి. అప్పటికి 12-30 అయుండచ్చు, ఎదో చిన్న చప్పుడు కావటం తో కళ్ళు తెరిచి చూసాడు మగతగా. ఆ మగతలో అపూర్వ డోర్ తెరుచు కొని బయటికి పోతు కనిపించింది. కొన్ని క్షణాలు ఆగి అతను బయటికొచ్చి చూసాడు అపూర్వకి ఏ అనుమానం రాకుండా. అపూర్వ వాళ్ళ గది  కి రెండు గదుల అవతల ఉన్న మరొక గదిలోకి వెళ్ళటం కనిపించింది. 

     హతాశుడయ్యాడు. మనసంతా అదోలా అయిపొయింది. నెమ్మదిగా ఆ రూమ్ దగ్గరికి వెళ్లి చూసాడు. బయట ‘డోన్’ట్ డిస్టర్బ్, టాగ్ వేలాడుతూ కనిపించింది. రూమ్ లోకి వచ్చాడు. అన్యమనస్కంగానే పడుకున్నాడు. తెల్లవారు ఝాముకి అపూర్వ రూమ్  లోకి వచ్చింది. ప్రసాద్ ని చూసింది. మంచి నిద్దరలో ఉన్నట్టుగా కనిపించాడు . ‘అమ్మయ్య’, అనుకోని అతని మీద చేయేసి పడుకుంది. ప్రసాద్ ఏమి తెలియనట్లు, ఆమె చేయి ని పక్కకు తోసి ఇంకోవైపుకి తిరిగి పడుకున్నాడు. అపూర్వ కి తెలియదు ప్రసాద్ తాను బయటికి వెళ్లడం చూసాడని, అప్పటిదాకా మేలుకొని ఉన్నాడని, తాను రావడం చప్పుడవటంతో, నిద్దర నటించాడని. ఎలాగయినా అసలు విషయం ఏమిటో తనని అడిగి ఏకాంతంగ  తెలుసుకోవాలనుకున్నాడు. 

    మొదటి రాత్రి  తెల్లవారింది. ప్రసాద్ కి ముందరే మెళకువచ్చింది. లేచి బ్రష్ చేసుకొని కాఫీ ఆర్డర్ ఇచ్చి , అక్కడ పెట్టిఉన్న మ్యాగజిన్ ఒకటి చేతిలోకి తీసుకొని చూస్తూ కూర్చున్నాడు. 

       ఎనిమిది గంటల దాక అపూర్వ నిద్దరలోనే ఉన్నది. రూమ్ బెల్ మోగగానే ప్రసాద్ తలుపు తెరిచాడు, ఎదురుగ సుమతి, చంద్రమౌళి గారు నిలుచుని కనిపించారు. 

“ఫ్రెష్ అప్ అయ్యారా ప్రసాద్ , రాతిరి  బాగా గడిచిందా ?నిద్దర బాగా పట్టిందా?” అంటూ ముసిముసి గ నవ్వుతు సుమతి లోపలికివచ్చింది. ఇంకా పడుకొనే ఉన్న అపూర్వ ని చూస్తూ,” మేము గారాబం చేసామంటే  ఓకే, నువ్వు కూడా అంతే  గారాబం చేసావనుకో, దాని పనులు కూడా నువ్వే చేయాల్సి ఉంటుంది,” అంటూ “ అపూర్వ లేవే , లే, ప్రసాద్ ఎప్పుడో లేచాడు,” అంటూ అపూర్వ ను నిద్దర లేపి వాష్రూమ్ లోకి తోసింది ఆమె తెచ్చిన బట్టలను అందిస్తూ. 

      ఒక అరగంటలో అపూర్వ తయారయి వచ్చేసింది. అందరు రెస్టారెంట్ లోకెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి , “ ప్రసాద్, నువ్వు అపూర్వ నెమ్మదిగా ఇంటికి వచ్చేయండి, లంచ్ అక్కడే , ఇంకా  కొందరు బంధువులు ఇంట్లో నే ఉన్నారు,”  అంటూ చంద్రమౌళి లేచాడు. సుమతి కూడా చాల ఆప్యాయంగా ప్రసాద్ తల నిమురుతూ, “త్వరగా వచ్చేయండి,” అంటూ బయటికి వెళ్లిపోయారు .  ప్రసాద్ అపూర్వ  ఏదయినా చెబుతుందేమో అని ఎదురు చూడసాగాడు. 

 (ఇంకావుంది)                     

Written by Padma NeelamRaju

రచయిత గురించి:

పద్మావతి నీలంరాజు చండీఘర్ లో ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు. ఆమె నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్ర ప్రదేశ్ నుండి M A (Litt),
POST GRADUATE DIPLOMA IN TEACHING ENGLISH ,CIEFL, హైదరాబాద్‌ లో తన ఉన్నత విద్యను పూర్తి చేసింది. స్త్రీ వాద సాహిత్యంపై దృష్టి సారించి Indian writing in English లో Panjabi University, patiala , Panjab, నుండి M phil డిగ్రీ పొందింది. తెలుగు సాహిత్యం పైన మక్కువ ఇంగ్లీషు సాహిత్యంపై ఆసక్తితో ఆమె తన అనుభవాలను తన బ్లాగ్ లోను
( http://aladyatherdesk.blogspot.com/2016/02/deep-down.html?m=1,)
కొన్ని సాహితీ పత్రికల ద్వారా పంచుకుంటున్నారు. ఆమె రచనలు తరచుగా జీవితం మరియు సమాజం పట్ల ఆమెకున్న అనుభవపూర్వక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. ఆమె అధ్యాపకురాలిగా గ్రామీణ భారత్ పాఠశాలల్లో E-vidyalok- e-taragati (NGO) లో స్వచ్ఛంద సేవలందిస్తున్నారు. రచన వ్యాసంగం పైన మక్కువ. పుస్తకాలు చదవడం, విశ్లేషించడం (Analysis / Review) ఆంగ్లం నుండి తెలుగు లోకి అనువాదం(Translation) చేయడం అభిరుచులు . PARI సంస్థ (NGO) లో కూడా ఆమె గ్రామీణ భారత జీవన శైలిని ప్రతిబింబించే వ్యాసాలను కొన్నిటిని తెలుగులోకి అనువదించారు (padmavathi neelamraju PARI). HINDUSTAN TIMES, తరుణీ ,మయూఖ, నెచ్చెలి వంటి పత్రికలలో కొన్ని కధలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. “Poetry is the sponteneous overflow of power feelings; recollected in tranquility” అన్న ఆంగ్ల కవి వర్డ్స్ వర్త్ తనకు ప్రేరణ అని చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వీడ్కోలు(Fall Season )

నా పల్లె…