ఇద్దరూ సమానమే

యం.రోషిణీ
అనగనగా ఒక గ్రామంలో ఒక కుటుంబం ఉండేది ఆ కుటుంబ పెద్ద పేరు రాంబాబు తన భార్య పేరు లక్ష్మి ఆ దంపతులకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు .ఆ ఇద్దరు కొడుకులను పదవ తరగతి వరకు చదివించారు. అక్కడితో తమ చదువులు ఆపేశారు కూతురిని మాత్రం ఎనిమిదవ తరగతి వరకే చదివించారు. ఒకరోజు కూతురు తన తండ్రి వద్దకు వెళ్లి నేను చదువుకుంటా అని అడిగింది అయితే వాళ్ల నాన్న నువ్వు ఆడపిల్లవి నీకు చదివు ఎందుకు వద్దు చదవడం ఆపేసి ఇంటి పని చేయు అని తిట్టాడు. అప్పుడు ఆమె అనుకుంది అందరూ చదువుకుంటున్నారు నేనే ఎందుకు చదువుకోడం లేదు అని. ఇలా బాధపడితే ఏం వస్తది.మంచిగా చదువుకొని వాళ్ళ నాన్న ఆలోచనలో మార్పు తీసుకు రావాలనుకుంది. అప్పటినుండి ఆమె ప్రొద్దున్నే ఇంటి పనులు చేసి తర్వాత పాఠశాలకు వెళ్లి ఆ తర్వాత వేరే వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ ఇంట్లో పనులు చేస్తూ ఎంతో కష్టపడి తన కష్టార్జితంతో చదువుకుంది. ఆమె పదవ తరగతి పూర్తి చేసింది. మంచి మార్కులతో పాసయ్యింది పరీక్షలు అయిపోయాక సెలవుల్లో బట్టలు కుట్టడం నేర్చుకుంది ఆమె కష్టపడి దాచుకున్న పైసలతో బట్టల మిషన్ కొనుక్కుంది అలా కాలం గడుస్తుండగా ఆమె చాలా డబ్బులు సంపాదించింది తర్వాత తన పోలీసు లక్ష్యం పైన పట్టుదలతో ఉన్నది. ఆమె తన లక్ష్యం చేరుకోవడానికి వేరే గ్రామం వెళ్లి అక్కడ చదువుకోవాలని అనుకుంది. ఇంట్లో చెబితే అమ్మానాన్నలు ఒప్పుకోరని ఆమె ఇంట్లో చెప్పకుండా వేరే ప్రాంతానికి వెళ్లి అక్కడ కష్టపడి పని చేస్తూ పోలీస్ శిక్షణ తీసుకుంది. ఒకరోజు వాళ్ళ అమ్మానాన్నలు ఈమె గురించి తెలుసుకొని ఆమెకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని అడిగారు ఆమె ఇంటికి వెళ్తే తన ఆశయం కోల్పోతాను కావచ్చు అని అనుకొని అక్కడే ఉండి పోలీస్ శిక్షణ తీసుకుంది. ఇంటికి వెళ్లలేదు కొన్ని రోజుల తర్వాత ఆమె పోలీస్ శిక్షణ పూర్తి పూర్తి చేసింది ఆ తర్వాత పోలీస్ ఉద్యోగానికి సంబంధించిన పరీక్షలు రాసేటప్పుడు ఎలాగైనా బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించి మా అమ్మానాన్నల కళ్ళు తెరిపించాలని అనుకుంది. అనుకున్నట్టుగానే మంచి మార్కులు సాధించి పోలీస్ ఉద్యోగాన్ని సంపాదించి ఉద్యోగంతో వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అప్పుడు వాళ్ళ అమ్మానాన్న బయటకు వచ్చి ఆశ్చర్యంగా చూశారు. తమ కూతురు. ఆమె తన టోపీ తీసి వాళ్ల నాన్న తలపై పెట్టింది వాళ్ళ నాన్న కళ్ళలోంచి నీళ్లు వస్తున్నాయి ఆమె వాళ్ళ అమ్మానాన్నలతో ఇలా అన్నది అమ్మ నాన్న ఆడదంటే అబల కాదు సబల అని చెప్పి వాళ్ళ అమ్మానాన్నలకు కళ్ళు తెరిపించింది ఆమె చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే ఇటు తన కోరిక నెరవేరినందుకు అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు కనువిప్పు కలిగించినందుకు ఇలా అప్పటినుండి అందరూ తమ కొడుకుల్ని ఒకలా తమ కూతురిని ఒకలా చూడడం కాకుండా ఇద్దరినీ సమానంగా చూసే చూశారు

Written by M. Roshini

యం.రోషిణీ
8 వ తరగతి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
గ్రా.రేగులపల్లి
మం.బెజ్జంకి
జి.సిద్దిపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అబల కాదు సబల

ఉగాది