ఆ… నా… ప్రపంచం

కవిత

రంగరాజు పద్మజ

ఏడేడు జన్మలలోనా భాగస్వామిగా తానౌను!

సుందర హృదయుడు- ఆనంద నిలయుడు !
నా హృదయేశుడతడు!

అతని సమక్షంలో
ఊసులు తీయని బాసలై,
మోసులెత్తు కోరికలు !

అడుగడుగునా- మనసు మడుగులు పరుచునతడు !

మక్కువతో చెలిమి చేయు చక్కని చెలికాడతడు!

చెంతన చేర ఉక్కు బాహువుల ప్రాకారమతడు!

ఆజ్ఞలు జారీ చేయువేళ
అతడు ప్రభువు- నేను దాసిని!

చల్లని సాయంవేళ ఆలోచన తనువును సేదతీర్చు స్నేహితుడతడు!

మనసు గాయపడిన వేళ-
ప్రేమమలాము పూయునతడు !

కలనైన పరకాంతల తలచని
నా రాముడతడు!

సాహిత్య చర్చ వేళ
భువనవిజయమ్మతని
ప్రాంగణం!

గొంతెత్తి పాడువేళ
విశ్వకవి భావమతడు!

భావనా లోకపు విహారాన- కృష్ణ శాస్త్రివారసుడతడు!

కానిదేముంది? నా చెలికాడు? అతనే నా ప్రపంచమతడు!

ఆ..నా.. ప్రపంచపు శోధనామయ గవాక్షమతడు!

Written by Rangaraju padmaja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆత్మావలోకనం The inside

గొప్పింటి విందు