ఆనంద బాష్పాలు….

కథ

విజయశ్రీ

ఏమోయ్ పద్మ!! ఒక కప్పు వేడి కాఫీ ఇస్తావా!! న్యూస్ పేపర్ లో నుంచి ముఖం తిప్పకుండానే పిలుస్తున్నాడు ప్రసాద్. ఆఁ …వస్తున్నా..
పద్మ పాలు పొయ్యి మీద పెట్టి చేతులు తుడుచుకుంటూ బయటికి వచ్చింది .అసలే పొద్దున్నే పని హడావుడి రాములమ్మ గిన్నెలు కడుగుతున్నది .ఈ లోపున కాస్త ఇల్లు సర్దుకోవాలి ,లేకుంటే ఎక్కడ దక్కడే పెట్టి ఊడుస్తుంది.
“అమ్మగారు ! ‘పాలు. పొంగుతున్నాయచయండి!” రాములమ్మ పిలుపు పరుగు పరుగున వెళ్లి కాఫీ కలుపుకొని కప్పు ప్రసాద్ చేతికి ఇస్తుండగానే ఫోను మోగుతోంది.
ఎవరబ్బా !! ఇంత పొద్దున్నే ఫోను అనుకుంటూ తీసి హలో ! అనగానే అవతల నుండి అన్నయ్య !!అంటూ తనకు ఎంతో ఇష్టమైన, అపురూపమైన చెల్లెలు శాంత గొంతు .ఒక్కసారిగా ప్రాణం లేచి వచ్చినట్లయిది.ఎవరండీ అన్నది పద్మ .మన శాంత .అవునా ఎప్పుడు వస్తోందిట?
ఇటు ఇవ్వండి నేను మాట్లాడతాను ఆఁ… వదిన! ఎట్లా ఉన్నారు? ఎప్పుడు వస్తున్నారు ?అని సంబరంగా ఇంత ముఖం చేసుకుని మాట్లాడుతున్న”ది. ఆదివారం వస్తాను వదిన. మీ అందరినీ చూడాలని ప్రాణం పీకుతుంది తప్పకుండా వస్తా.”
అవును వాళ్ళిద్దరూ వదిన ఆడపడుచులు అనేదానికన్నా ప్రాణ స్నేహితులు అంటే బాగుంటుంది ఇద్దరూ ఒకే వయసు .పద్మ పెళ్లి అయ్యేసరికి శాంతకింకా పెళ్లి కాలేదు .బాగా కలిసిపోయారు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరూ కలిసి వెళ్లేవాళ్లు. లైబ్రరీ పుస్తకాలు తెచ్చేది శాంత
చదువుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఆడపడుచు గా సతాయింపులు ఎన్నడూ లేవు. అందుకే అంత ఇష్టం.
*
ఇన్ని సంవత్సరాల తర్వాత చెల్లెలు ఇంటికి వస్తోంది.ప్రసాద్ గారి మనసు సంతోషంతో ఉప్పొంగి పోతోంది .ప్రేమ, బాధ అన్ని కలిపి కళ్ళు చెమర్చినాయి గత జ్ఞాపకాలు కళ్ళముందు మెదిలాయి.
చిన్నతనం నుంచి రాఖీ పండుగ నాడు పట్టు లంగా కట్టుకొని కుప్పెల జడ,నాగరం.వయ్యారంగా జడను ముందుకి వెనక్కి తిప్పుకుంటూ గలగల నవ్వుతూ లేడి పిల్ల లాగా గంతులు పెడుతూ నానా హడావుడి చేసేది. అన్నయ్య చేతికి రాఖీ కట్టేంతవరకు సందడి సందడి కాదు.
‌ శాంతి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది . భర్త రఘురాం చాలా మంచి వ్యక్తి . పేరుకు తగిన ప్రేమ మూర్తి .
శాంతను పంపించేటప్పుడు.అమ్మా నాన్నలతోపాటు, ప్రసాదు ,పద్మ కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ తమలో సగభాగం వెళ్ళిపోతోంది అన్నట్లు తల్లడిల్లిపోయారు. రఘురాం నవ్వుతూ “బావగారు !! ఈరోజు నుంచి మీ చెల్లెలు నాలో సగం. ప్రాణంగా చూసుకుంటాను. మీరేమీ బెంగపడకండి” అంటూ ఊరడించాడు .నిజంగానే పండంటి. సంసార జీవితం గడిపింది శాంత.
శాంత కు కూతురు పుట్టగానే “రాణి ప్రియ “అని పేరు పెట్టి , మాకు కోడలు పుట్టింది ,అని తెగ సంబరపడిపోయారు. నానాటికి పిల్లలు పెరగటంతో పాటు ఆ బావా మరదళ్ళ మనసుల్లో అదే భావం నాటుకుపోయింది ఆశలు చిగురించి పరిమళించినాయి. ఇద్దరి మధ్యన ఎన్నెన్నో కబుర్లు. కలిసి సినిమాలకు వెళ్లేవారు .కాబోయే భార్య భర్త లేగా …అని అభ్యంతర పెట్టేవారు కాదు ఎవరు. రమేష్ పై చదువులకి అమెరికా వెళ్ళాడు అక్కడనే జాబ్ చూసుకొని స్థిరపడిపోయాడు.
రాణి ఫోన్లు చేస్తూనే ఉన్నది కానీ రమేష్ సరిగా లిఫ్ట్ చేయడం లేదు .తను కూడా ఫోన్లు చేయడం తగ్గించాడు.
అమెరికాలో వేరే అమ్మాయి ఆకర్షణలో పడిపోయాడు.
కొడుకుని కాదనలేక పెళ్లి చెయ్యక తప్పింది కాదు. ‘గ్లాసు పాలలో ఒక ఉప్పు రాయి ‘ లాగా అన్నా చెల్లెలు మధ్యన ఊహించని దూరం పెరిగింది. ఒకరిది మనోవేదన మరొకరికి ముఖం చెల్లక.
కొన్ని రోజులు బాధపడినా… తర్వాత శాంతి దంపతులు కూతురికి నచ్చ చెప్పారు. ‘నీకేమి తక్కువ’! ‘నువ్వు ఒక డాక్టర్ వి నీకు అంతకన్నా గొప్ప జీవితం వస్తుంది ‘అంటూ.
ప్రసాదు ప్రాణ స్నేహితుడి కొడుకు రాకేష్ పేరున్న గొప్ప కార్డియాలజిస్ట్. రాణీ రాకేష్ లో వివాహం వైభవోపేతంగా జరిగింది. కాలం గిర్రున తిరిగింది. వాళ్ళ ది ఇప్పుడు ఇద్దరు పిల్లలతో ముచ్చటైన కుటుంబం.
ఒక రోజు రఘురాం ” శాంతా ! ఇప్పుడు మన పిల్లకి ఏం తక్కువయింది !! “పాపం మీ అన్నయ్య చాలాసార్లు పిలుస్తున్నారు .బంధాలు తెంచుకుంటే తెగేవి కాదు.వెళ్ళిరా”అన్నాడు .శాంత భర్త మంచి మనసుకి
మనసు లోనే కృతజ్ఞతలు చెప్పుకున్నది.
**
ఆదివారం రానేవచ్చింది . హడావిడి గా స్టేషన్ కు వెళ్ళాడు ప్రసాదు. వెయ్యి ఆశల కాంతులతో ఎదురుచూస్తున్న కళ్ళకు రైలు దిగుతూ కనిపించింది శాంత. మమతాను రాగాలు పునః చిగురిస్తున్నాయని సంకేతం ఇస్తూ చల్లగా కురుస్తున్న వానలో చెల్లెలికి గొడుగు పట్టి రోడ్డు దాటించాడు .కారులో ఇల్లు చేరుకున్నారు.
వదిన ఆడపడుచులు ఒకరినొకరు కౌగిలించుకొని సంబరం గా పలుకరించుకున్నారు.యోగక్షేమాలు, ఎన్నెన్నో కబుర్లు.ఆరాత్రి శివరాత్రే అయింది.
**
అన్నయ్య కు హారతి ఇచ్చి, సేమ్యా పాయసం
మైసూర్ పాక్ తినిపించింది
ఆ ఇంట్లో రాఖీ పండుగ హర్షపు
వి రిజల్లులతో తడిసిన మనసులు తో ఆనంద భాష్పాలు కురిసినాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఉత్తరం

శృతి తప్పిన వీణ