
తిమిరాలెప్పుడూ ఉంటాయిగా.. వెనకో ముందో!
వాటిని దాటుతోంది అనంతమైన వెలుగు!
ప్రయత్నం, పరిశీలన, పరిష్కారంతో
ఓ ఆనందజ్యోతి మనవెంటే నిలుస్తూ..
అనేకానేక అనిశ్చిత పరిస్థితుల మధ్య
నిబ్బరం చూపించగల స్నేహజ్యోతిని
వెలిగించుకుందాం! రండీ!
సాధారణ జీవితంలో
అసాధారణమైన ఊహల్లో నుండి జనించే
కళ, కల్పనా జగత్తు సృష్టి!
దీప్తి వలయంలో సావాసంతో
ప్రమిదలు, ప్రమదావనంగా
కళకళలాడుతూ,సందడిచేస్తూ…!
ఒక్కో బతుకుపుస్తకంలో
నవరసాలు పండించే విధి
దీపావళి పండుగలో ఆత్మీయతా రసం
కొత్తగా ఆవిష్కరణ చేస్తే
ఆస్వాదనకు కలిపే చేతులెన్నో..
శుభాకాంక్షలతో,
సమతా జ్యోత్స్న లకు స్వాగతం!!