రాత్రి ఒ౦టిగంట అయింది.కారు పార్కు చేసి ఆరోఅంతస్తుకి లిఫ్ట్ లో చేరుకున్నారు,అర్చన,శేఖర్.తలుపుతాళం తీసి ఇంటిలో అడుగుపెట్టిన ఇద్దరికీ ఆశ్చర్య౦ కలిగింది.హాల్లో లైట్ వెలుగుతో౦ది,సోఫాలో కూర్చుని పుస్తకం చదువుకు౦టో౦ది దేవకీ శేఖర్ తల్లి.’’నువ్వింకానిద్రపోలేదా,’’అడిగాడుశేఖర్,
‘’లేదు మీరు వస్తారని కూర్చున్నా’’
‘’మేము వచ్చేటప్పటికిలేట్ అవుతుందని మీరు డిస్ట్రబ్ కాకూడదని మేము తాళం తీసుకువెళ్ళాము కద౦డి.’’అంది అర్చన.
‘’తెలుసు,మీతో మాట్లాడాలనే నేను ఇక్కడకూర్చున్నా.’’
తెల్లవారేకమాట్లాడావచ్చులేమ్మా.’’సోఫా లో కూర్చుని బూట్లు విప్పుతూ అన్నాడు శేఖర్.
‘’ఏరా ఎప్పుడైనా మీరు సూర్యోదయాన్ని చూసారా,అందులో రేపు సెలవు ఉదయంపదకొండు గంటలు లోపునమీరెప్పుడైనా నిద్ర లేచారా.అప్పుడు బ్రేక్ ఫాస్ట్ తిని స్నానాలు చేసి లంచ్ అయ్యేటప్పటికేమధ్యహ్నంమూడు.మళ్ళీ వీకెండ్ ఎక్కడికీ వెళ్ళక పొతే ఎలా అంటూ ఏ మాల్ కో సినిమాకో పోతారుఇంకేప్పుడు ఇంటిని పట్టించుకునేది.మాతోమాట్లాడేది,
‘’ఏ౦చెయ్యమంటారూ మా ఉద్యోగాలు అటువంటివి.’’అంది అర్చన తనూమరో సోఫా లో కూర్చు౦టూ’’వంటవాడు,పనిమనిషి వున్నారు.ఇంకాఇంటిగురించిపట్టించుకోవడానికేముంది.’’
దేవకీ నవ్వింది,’’తమాషాగా చెపుతారు చూడు బెడ్ ను కొనగలం కానీ నిద్రను కొనలేమని…అలాగా పనివాళ్లు వుంటే సరిపోదు వాళ్ళమీద అజమాయిషీ ఉ౦డాలి.మొన్న ఆటా అయిపోయింది అంటే అప్పుడే అయిపోయిందా అన్నావు…….అర్చన ఏదో అనబోయింది.’’నిన్ను నేను తప్పు పట్టడం లేదమ్మా.పూర్తిగావిను,మావికూర్చునిచేసేఉద్యోగాలుఏక్సర్సైజ్లేదు,అంటూ అన్నం మానేసి చపాతీలు తి౦టున్నారు.చపాతీలు చేయించిన రోజు ఏదో పార్టి అనో బయట తిని చాలా రోజులు అయి౦దనో తినరు.అవి వేస్ట్ అయిపోతాయని నేను మీ డాడి తి౦టున్నాము.మాకు షుగర్,బి.పిలాటివి లేవు కాస్త పెరుగన్నం తినకపోతే నిద్ర పట్టదు.మొన్న పనిమనిషి కి ఇస్తే రోజూ ఇవ్వకండి.అంది.’’
‘’ఏ౦ చేస్తాం,మా ఉద్యోగాలు అలాంటివి.,’’అందిఅర్చన,నిజమేఅన్నట్టుచూసాడు శేఖర్.
‘’కాదనడంలేదు,మేము ఉద్యోగాలు చేసాము.ఆఉద్యోగాలువేరు.ఎంతలేట్ అయినా సాయ౦త్ర౦ ఆరుగంటలకు ఇంట్లో వుండేవాళ్ళము.కానీ ఈ పార్టీలుఅవీ ఏమిటి.?’’
‘’చేప్పానుకదండీ మా ఫ్రెండ్ కు పెళ్లి కుదిరిందని.’’అందిఅర్చన.
దేవకీ నవ్వింది,’’తెలుసమ్మా.మీ ఫ్రెండ్ దివ్య కే కదా పెళ్లి కుదిరింది.అందుకు ఆమె క్రిందటి నెలలో పార్టి ఇచ్చింది.తర్వాతలాంగ్ వీకెండ్ మళ్ళీ దివ్య ఎప్పుడు కలుస్తు౦దో అంటూ అందరూ గోవా పోయారు.అక్కడివాతావరణం,తిండి సరిపోక వచ్చాక రెండు,మూడురోజులు అనారోగ్యం తో ఇబ్బంది పడ్డారు.భార్యాభర్తలిద్దరూ మొహాలు చూసుకున్నారు.తర్వాతవారంఆమె వుడ్ బీ వచ్చాడు పరిచయం చేసుకోవాలని పార్టీ అంటూ రాత్రి రెండుగంటలకువచ్చారు.క్రితంవారం మా టీం వాళ్ళంపార్టీ ఇస్తున్నాం అంటూ రాత్రి పన్నె౦డు గంటలకు
వచ్చారు,ఇదిగో ఈ వారం ఇలా.’’
‘’మాకే౦ సోషల్ లైఫ్ వు౦డోద్దా.’’కాస్త రోషంగా అడిగింది. అర్చన.
‘’తప్పకుండా ఉ౦డాలి.కానీ అది పర్సనల్ లైఫ్ ను మి౦గేయకూడదు.’’
‘’పర్సనల్ లైఫ్ మేమే౦ మిస్ అవుతున్నాం.’’అడిగాడు శేఖర్.
‘’నిజం చెప్పరా నువ్వు సూర్యోదయం చూసి ఎంతకాలం అయింది.’’
శేఖర్ మాటలాడలేదు.అర్చన మా ఉద్యోగాలు అలాంటివి అనబోయి ఆగిపోయింది.
‘’పోనీ ఆఫీస్ వున్నప్పుడుకూడా ఉదయం తొమ్మిది గంటల లోపు ఎప్పుడైనా నిద్ర లేచారా.
ఇలా అర్చన టీం లో ఒకఅమ్మాయి పెళ్లికే మీరు ఇన్నిసార్లు పార్టీ చేసుకు౦టే ఇంక నీ టీంలోవాళ్ళు మిగతా సభ్యుల పెళ్లిళ్ళకి మిగతా శుభకార్యాలకి ఎన్నిసార్లు ఆ పార్టీలు.అదే మొన్న మన బందువుల ఇంట్లో పెళ్లి అంటే మీరు వీలు కాదు రాలేమన్నారు.’’
‘’ఆ రోజు వర్కింగ్ డే అమ్మా.’’
‘’తెలుసు.అయినా ఒకసారి మొహం చూపించాడనికేమైంది.ఇలా అయితే బంధువులు ఎలా తెలుస్తారు.మీనాన్ననేనూ జాబ్స్ లో ఉన్నప్పుడుకూడా నీకు చెల్లెలికి ఇబ్బంది అవుతుందని ఒకరమైనా ఫంక్షన్ కు వెళ్ళేవాళ్ళము ఇప్పుడు లైఫ్ బిజీ అయింది కాదనడలేదు,
కనీసం కొన్నిశుభకార్యాలకైనావెళ్ళాలి,అంతదాకా ఎందుకు ఇంట్లో పూజ గదిలోకి నువ్వు కానీ అర్చన కానీ వెళ్లి ఎన్నిరోజులుఅయింది..’’ఇద్దరూ మళ్ళీ మొహాలు చూసుకున్నారు,నేనూ,డాడీ ఎవరో ఒకరం పూజ చేస్తున్నాము,కానీ మేము చెల్లెలి దగ్గరికో మన ఊరికోవెడితే….’’
‘’ఎప్పుడో నేను మరిచిపోయిన పూజా విధి.’’
‘’పెద్ద పూజలు చేయనక్కరలేదురా.దీపం పెట్టి శుక్లా౦ బరధరంచదివినాచాలు,ఈఇంటియజమానిగా అది నీ బాధ్యత. అంతేకాదు శరీరానికి కదలిక లేదని ఎందుకుబాధ.
ఈ వీధి చివర వార౦,వారం కూరల మార్కెట్ పెడతారు.సాయ౦త్ర౦ అలా నడుచుకు౦తూ వెళ్లి కూరలు తెచ్చుకుంటే……షికారుకి,షికారు,ఎక్సర్ సైజ్ కి ఎక్సర్సైజ్……..తాజాకూరలు.వాళ్ళమాటతీరు,వాళ్ళజీవనవిధానం.అన్నీతెలుస్తాయి.’’దేవకీ మాట్లాడుతున్నా శేఖర్,అర్చనల ఫోన్స్ లో మెసేజ్ వస్తున్న చప్పుడు.
అదివిని నవ్వింది దేవకీ.చూసారా నేను చెప్పానా అప్పుడే రేపు…కాదు పన్నె౦దు దాటి౦దిగా ఈవేళ ప్రోగ్రాం గురించి ఫోన్స్.’’
‘’అయితే మ్మమ్మల్ని ఏ౦ చేయమంటారు.’’అడిగిందిఅర్చన.ఆమెకుఈఅర్ధరాత్రి సమావేశ౦ విసుగ్గా వుంది.
‘’అవునమ్మా,’’అన్నాడు శేఖర్ కూడా.
‘’ఏమీ చేయమనడంలేదు,మీ లైఫ్ స్టైల్ గురించి మిమ్మల్ని అలోచి౦చమ౦టున్నా.మీ ఆరోగ్యం,ముఖ్య౦గామీ టైము మీ చేతుల్లో ఉ౦డేలా చూసుకోండి.ఇంక నిద్రపో౦డి.’’
దేవకీ పుస్తకం తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయి౦ది.
శేఖర్,అర్చన తమ బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయారు.ఇద్దరికీ పార్టీ కి వెళ్లి వచ్చిన వుత్సహంలేదు.నిజానికి సగం పార్టీలుమొహమాటానికి ,తప్పదని వెళ్ళేవే.ఇద్దరూ కాస్త ఫ్రెష్ అయి పడుకున్నారు.మళ్ళీ ఫోన్ లో మెసేజ్ సౌండ్.అర్చన తీసి చూసింది.’’ఎవరు అన్నిసార్లు మెసేజ్ లు.’’అడిగాడు శేఖర్,
‘’గోకుల్..రేపటి లంచ్ కి మనకి టేబుల్ బుక్ చేయాలా ,వద్దా అని.’’
శేఖర్…ఒక సెకను ఆగి అన్నాడు.’’వద్దు రావడంలేదని మెసేజ్ చెయ్యి.’’
ఆపనే చేసి ‘’ఆ౦టి మాటలకు అప్పుడే నువ్వు మారిపోయావా.’’
‘’ఏ౦ నువ్వు మారలేదా……నిజం కాస్త కష్ట౦గా ఉ౦డ వచ్చు,కానీ అది చాలా ఉపయోగం…..
(అయిపొయింది’)