
అనగనగా ఒక పల్లెటూర్లో ఒక కుటుంబం ఉండేది సోమయ్య అతని పేరు అతనికి ఒక కొడుకు మరియు ఒక కూతురు.
అతడు కూలీ పని చేస్తూ వాళ్ల కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు.అతడు కొడుకును,కూతురునీ బడికి పంపుతుండేవాడు అతనికి కొడుకు అంటే చాలా ప్రేమ కూతురిని చిన్న చూపు చూసేవాడు ఆమె చాలా బాధపడే ఎప్పుడు తమ కూతురిని తిట్టేవాడు.అన్ని బాధలను ఓర్చుకోలేక ఒక్కోసారి చనిపోవాలని అనుకుందికూతురు. కానీ తన లక్ష్యాన్ని తాను చేరుకోవాలని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని రాత్రింబవళ్లు కష్టపడి చదివేది. అలా కాలం గడిచింది ఆమె పదవ తరగతి కూడా పూర్తి చేసింది. ఆమె తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇంటర్ విద్యను కూడా పూర్తి చేసింది. వాళ్ళ అమ్మ నాన్నలకు తెలియకుండా ఆమె ఆర్మీ కోర్స్ శిక్షణ కోసం హైదరాబాదుకు వెళ్లి అక్కడ ఆర్మీ కోర్సులో శిక్షణ తీసుకుంటుంది కొద్దిరోజుల తర్వాత వాళ్ళ నాన్న ఫోన్ చేసి ఆడపిల్లవు నీకు అటువంటి ఉద్యోగాలు ఎందుకు అనీ,ఆడపిల్లవు ఇంట్లో ఉండి పని చేసుకోక పట్నం వెళ్లి చదవడం ఎందుకు అని అన్నాడు అప్పుడు కూతురు ఆడపిల్ల అంటే వంటింటి కుందేలు కాదని ఆడది అంటే అబల కాదు సబల అని నిరూపించి వాళ్ళ నాన్న కళ్ళు తెరిపించాలని అనుకుంది. అలా ఆమె ఎంతో కష్టపడి ఆర్మీ శిక్షణ పూర్తి చేసుకొని పరీక్షలు రాసి ఆర్మీలో ఉద్యోగం తెచ్చుకొని తన లక్ష్యాన్ని సాధించి ఆడది అబలకాదు సబల అని నిరూపించింది. అప్పటినుండి వాళ్ళ ఊరి ప్రజలందరూ ఆడపిల్లల్ని చిన్నచూపు చూడకూడదని అనుకొని ఆడపిల్లంటే తక్కువ కాదు మగ పిల్లవాడు ఉంటే ఎక్కువ కాదని తెలుసుకొని అప్పటినుండి ఆడపిల్లల్ని బడికి పంపించడం మరియు ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టారు
నీతి అడ్డది అంటే అబల కాదు సబల