అపర కుబేరుని ఇంట జననం
పసిడి రాశుల నడుమ పారాడిన శైశవం
నవరత్నాలతో గచ్చకాయలాడిన బాల్యం
కాలం ఓ పట్టాన అర్థమవని స్థితి
కాలం ఓ అయోమయ సందర్భం
ఆగ్రహించిన సిరి ఆకస్మిక నిష్క్రమణం
అంతఃపురవాసం అతలాకుతలం
చేజారిన షడ్రసోపేతం భోజన పళ్లెం
నూలు వస్త్రాలలోకి ఒదిగిన నవయవ్వనం
అతి సామాన్య ఆహారం ఆహార్యం
అసాధారణ ప్రతిభా పాటవాలు పడినవి అయోమయం
పలుకులైనవి కాఠిన్యం అంతరంగమేమో నవనీతం
ఏటికి ఎదురీది న మనో ధైర్యం
అసమానతలను దునుమాడిన స్థైర్యం
అణచివేతలకు తిరగబడిన శౌర్యం
కత్తి మీద సాము అయిన విద్యాభ్యాసం
అకుంఠిత దీక్ష ఫలితం
అలవరచింది బోధన రంగ పీఠం
మట్టిలో మాణిక్యాలను వెలికి తీసిన ఔదార్యం
బాసర భారతి కీర్తి కిరీటాన పొదిగిన నైపుణ్యం
ఫ్లోరెన్స్ నైటింగేల్ ను తలపించిన సేవా భావం
ఉపచారాలకు సంతసిల్లిన సమ సమాజం
కాలం ఓ పట్టాన అర్థం కాని విచిత్రం
కాలం ఎటు వైపున చూసిన చిత్ర విచిత్రం
ఆదర్శాల జీవన చరమాంకం
అశ్రునయనాల ఆశీర్వచనం
ఒడిలో విరిసిన శ్వేత కమలాన చక్కని ఫలితం
ధన్వంతరి అమృత కలశ ఆవాహనం
కాలం కలిసి రావాల్సిన కలల తీరం
కాలం కలవని దారుల పయనం
అడుగడుగునా ఎదురొచ్చే అవాంతరాల భారం
అలుపెరుగని పోరాట జీవనం
లక్ష్యసాధనలో సంధించి వదిలిన బాణం
పద్మశ్రీ
పడి లేచిన కడలి తరంగాన్ని స్ఫూర్తిగా తీసుకున్న దుర్గ (జలతారు
కలలు) పాత్ర దయనీయత కంటే స్ఫూర్తిమంతంగా ఉంది.
విమర్శల కూలంకశ వివరణ ( ఉషోదయం ), సమాజంలో అడుగడుగునా విస్తరించి ఉన్న మనస్తత్వాలకు అద్దం పట్టింది. పదునైన కలాలను పరిచయం చేస్తున్న సామర్థ్యానికి వందనం ?
బంధం బీటలువారుటకు పరోక్షంగా షరతులే కారణమని (థిస్ ఈస్ యువర్ ఎనర్జీ ) చక్కని సందేశాన్ని అందించారు ?
కబంధ హస్తాల్లో చిక్కి విలవిల్లాడుతున్న బాల్యం (లైంగిక వేధింపులు) పై గత సంచికలో ‘ నేను సైతం ‘ అంటూ రచయిత్రులు స్పదించిన తీరు ప్రశంసనీయం.
సమాజ చైతన్యానికి బాధ్యతగల పౌరులుగా తమ వంతు పాత్రను పోషించిన వ్యక్తులందరూ అభినందనీయలే, గౌరవనీయులే ?