‘అనూరాధకి ..ఆశీర్వచనాలు’ — అన్న పిలుపు నేడు మూగ పోయింది –

1992 మే నెలలో ‘ఆజాద్ పుర’ (ఢిల్లీలో) నుండి వెళ్తు, డిల్లివిశ్వవిద్యాలయాన్ని చూసి, అందులోకి వెళ్ళాను.  తెలుగు శాఖ ఉందేమో’ అనుమానంతో అడిగాను. MIL (మాడరన్ ఇండియన్ లాంగ్వేజెస్) అనే డిపార్టు మెంట్ లో  తెలుగు ఉంది, అని చెప్పారు. వెంటనే అక్కడికి వెళ్ళి, తెలుగు డిపార్ట్మెంట్ హెడ్ ప్రొ.సుశీల గారిని కలిపాను. నేను Ph.D చేయాలని, ఎలా అడ్మిషన్ దొరుకుతుందో ? అడిగి తెలుసుకున్నాను. వెంటనే అందుకు మేడంగారు నా ఆసక్తిని గుర్తించి, ఎంట్రన్స్ వ్రాయించి, దానిలో ముగ్గురం అర్హత పొందాము. లక్ష్మి, NC లత (PB (శ్రీనివాస్ కూతురు) నేను . pre Ph.D తరగతులు 6 నెలలు రెగ్యులర్ గా వెళ్ళాము. ఆ తరగతుల అనంతరం ఒక టెస్ట్ పెట్టారు. దానిలో ముగ్గురం పాస్ అయ్యాక పరిశోధనకు అనుమతించారు.

మా ph.Dగైడ్… ఢిల్లీ విశ్వవిద్యాలయ తెలుగు ప్రొఫెసర్

1993 డిసెంబర్ లో  – అప్పటినుండి అనునిత్యం సుశీలగారితో  అనుబంధం పెరిగింది. వాళ్ళింట్లో నేను కూతురినయ్యాను. వారి బాగోగులు చూసుకుంటూ, నా ఇద్దరు పిల్లలకి అమ్మమ్మ, తాతయ్యల ప్రేమనందించారు. నా పరిశోధనకు అన్నిరకాల ప్రోత్సాహాన్ని అందించారు. 1996 హైదరాబాదుకు వచ్చి గురుకుల విద్యాసంస్థలో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగంలో చేరాను. ఆసమయంలో కుటుంబం, వృత్తి బాధ్యతలతో నా సిద్ధాంత గ్రంథం పూర్తిచేయలేని సంక్షోబంలో పడిపోయాడు.. కాని, సహ ఉపాధ్యాయులు, మేడంగారు, అంకుల్ గారు నన్ను ఉత్సాహ పరచి 2001 లో పరిశోధన గ్రంథాన్ని విశ్వవిద్యాలయంలో సమర్పించే విధంగా సహకరించారు.

ఆంగ్లంలో పట్టులేని కారణంగా వైవాలలో నేను జవాబులు ఇవ్వలేనేమో అనుకున్నాను. సుశీల మేడం నాకు ధైర్యాన్నిచ్చారు. మా MIL డిపార్ట్ మెంట్ లో ప్రొ.బాలసుబ్రమణ్యం(తమిళం),ప్రొ.జయంతి చటోపాద్యాయ (జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత,అస్సామి),ప్రొ.సుశీల  గారలు మొదలగు 11 మంది వివిధ భాషాప్రవీణులు,(Heads) కలిసి నాతో  (అర్ధమయ్యే విధంగా) ప్రశ్నల సమాధానాలు చెప్పించారు.  ఆ పరీక్షలో నెగ్గించి “కంగ్రాచ్యులేషన్స్ డాక్టర్ అమారాధ• అంటూ శుభాభినందనలు తెలుపుతు కరతాళధ్వనులు చేస్తున్న సంఘటన నేటికీ నా కళ్ళముందు మెదులుతుంది.

ఆతర్వాత ఫిబ్రవరి 23, 2002న “అబ్దుల్ కలాం గారు, విశ్వ విద్యాలయ చాన్సలర్  చేతులమీదుగా, ఢిల్లీవిశ్వ విద్యాలయ ప్రాంగణంలో ‘డాక్టరేట్’ అవార్డ్ తీసుకోవడం- నాకు జీవన సాఫల్యం పొందినట్లు అనుభవించాను. మేడంగారి కళ్ళలో ఆనందం మెరిసింది. ఆనెలలో మేడం రిటర్మెంట్.ప్రమోషన్ కూడా వచ్చింది,అందుకే మాకు పోచంపల్లి పట్టుచీరలు కొనిపెట్టింది.

అప్పటి నుండి ఆకుటుంబంతో ఉన్న అనుబంధం కొనసాగే విధంగా వారిని చూసుకోవడానికి నావిద్యార్థి లక్ష్మిని  (నా అన్నవారు దూరమైన) వారి దగ్గర పెట్టాను.ఆ లక్ష్మిని చదివించి,ప్రయోజకురాలిని చేసి,  తన కాళ్ళపై తాను నిలబడేట్లు చేసారు.ఇప్పుడు లక్ష్మి ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని ఏర్పరుచుకుంది. సుశీలగారు ఆమె జీవన ప్రధాత.

ఎప్పుడు “ఆశీర్వచనాలు’ అంటూ ఫోన్ చేసి, మా యోగ క్షేమాలు తెలుసుకునేది. మేడం ద్వారా ఎందరో పెద్దలు  ఆచార్య బిరుదరాజు రామరాజుగారు, డా.సి.నారాయణరెడ్డి, ఆచార్య ఎస్వీ రామారావు. బోయి విజయ భారతి గారలను  కలిసే అవకాశంతో పాటు , వారితో సన్నిహిత సంబందం ఏర్పాడే విధంగా బంధం ఏర్పడింది.  సౌశీల్యం, నిబద్ధత,నిగ్రహం,గంభీరత వంటి సుగుణాలను కలిగిన సుశీల మేడం లాంటి గురువు దొరకడం నా పూర్వజన్మ సుకృతం.

.     . 4 రోజులక్రితమే ఫోన్ లో నాపుస్తకానికి ముందుమాట చెబితే వ్రాసుకున్న. మళ్ళీ  14నవంబర్  రాత్రి 1.45 ఫోన్ చేసారు. పొరపాటున కనెక్ట్ అయ్యిందేమో అనుకున్నాను. కాని అందరితో మాట్లాడాలని పించి చేసిందట. నేను తెల్లవారి ఫోన్ వేసాను. కాని అప్పటికి ఆవిడ ఆయసపడుతుంది. మాట తడబడతుంది. రెండు రోజులు ఊపిరి అందక ప్రాణం విలవిల లాడి 17-11-2024 తెల్లవారు 5:30 అనంతలోకాలకు వెళ్ళిపోయింది. 90 సం. నిండిన మామేడం ప్రోత్సాహకర మాటలు నా చెవుల్లో రింగుమంటున్నాయి. అప్యాయత, అనురాగం నిండిన ఆ హృదయాల తరం వెళ్ళిపోతున్నట్ల నింపించింది. ఆ అనుబంధం అనంతసాగరంలో కలిసిపోయింది,ఆ ప్రేమస్వరూపం పంచభూతాల్లో కలిసిపోయింది.

‘ఆత్మకి శాంతి చేకూరాలని కోరుతూ.

.                                                                                           మీకూతురిలాంటివిద్యార్థి…..

డా.శ్రీభాష్యం అనూరాధ(అధ్యాపకులు )

 

.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఇంద్రజీత్ కౌర్ సంధు

అయినంపూడి శ్రీలక్ష్మి