మాతృభాషను ఉచ్చరిస్తుంటే.. మకరందంలోని మాధుర్యం చవిచూసినట్టుగా ఉంది…
ఆలకిస్తుంటే..
అమ్మ ప్రేమలోని లాలిత్యాన్ని స్పర్షించిన అనుభూతినిస్తోంది…
విశ్వవ్యాప్తంగా ఆదరిస్తున్న మన తెలుగు భాషను చూస్తుంటే..
“ప్రపంచ సుందరి” కిరీటాన్ని పొందినంత ఆనందంగా ఉంది…
తెలుగు భాషలో లిఖిస్తుంటే..
మన మాతృమూర్తికి వందనాలు చేసినంత తృప్తిగా ఉంది…
అద్భుతమైన అనుభూతులు .. మమతను కలబోసుకున్న మాతృభాష.. కలకాలం సజీవంగా నిలుస్తుందన్న విశ్వాసం నాకుంది…
విదేశాలకేగినా, తల్లితండ్రులను వీడలేనట్టు..
అన్యభాషలు అభ్యసించినా, మాతృభాషను మరచిపోము …
మాతృమూర్తిని గౌరవించినట్టు..
మాతృభాష కు పట్టం కడితే,
కన్న బిడ్డల తపన చూసి
భరతమాత సైతం మురిసిపోయి గర్విస్తుంది…
జయహో మాతృభాష… !